మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఓటింగ్ శాతం పెంచేందుకు ఓటరు అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో స్వీప్
కార్యక్రమాలు నిర్వహణపై రెవిన్యూ, డిఆర్డిఓ, విద్యా, పంచాయతీ, ఇంటర్మీడియట్ తదితర శాఖల అధికారులతో
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో 166 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్
తక్కువగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అట్టి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కళాజాత
కార్యక్రమాలు ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిపిఆర్డీను ఆదేశించారు. మెప్మా, మహిళా
స్వయం సహాయక సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పరిశ్రమల్లో ఓటింగ్ శాతం
పెంచేందుకు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యాసంస్థల్లో
విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లోని
ప్రధాన కూడళ్లులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, స్వీప్ నోడల్ అధికారి, పంచాయతీ అధికారి రమాకాంత్, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, యువజన క్రీడల
అదికారి పరందామరెడ్డి, డిపిఆర్ శ్రీనివాస్, తహసిల్దార్లు, యంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.

- అదికారి పరందామరెడ్డి, డిపిఆర్ శ్రీనివాస్, తహసిల్దార్లు, యంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.