UPDATES  

 వనమా కొడుకు దూకుడు!..

  • వనమా కొడుకు దూకుడు!
  • బీఆర్ఎస్ క్యాడర్ కు తలనొప్పిగా మారిన రాఘవ
  • ఇప్పటికే కొంతమంది దూరం దూరం
  •  తాజాగా వనమా మేనల్లుడు కొత్వాల కాంగ్రెస్ లోకి జంప్
  • ఇంకొందరు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

కొత్తగూడెం ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు దూకుడుతో బీఆర్ఎస్ లోని కొంతమంది తట్టుకోలేక

ఇప్పటికే దూరం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందేనని పలువురు పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా ఎన్నికల ప్రచారానికి రాఘవ వస్తే సహకరించమని పలువురు బీఆర్ఎస్ శ్రేణులు తేల్చి చెప్పడం విధితమే. తాజాగా పాల్వంచ సొసైటీ చైర్మన్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మేనల్లుడు కొత్వాల శ్రీనివాసరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మణుగూరుకు వచ్చిన ఏఐసీసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో చేరడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. వనమా వెంకటేశ్వరరావుకు మంచితనం ఉన్నప్పటికీ ఆయన కొడుకు రాఘవ తీరు వల్ల గులాబి క్యాడర్ లోని పలువురు విసిగి వేసారి పోయి బయటకు జారుకుంటున్న పరిస్థితి నెలకొందని ఒకరిద్దరు సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉంటే బీసీ బందు దళిత బందు మంజూరులో కొందరి లబ్ధిదారుల నుండి రాఘవ కమిషన్లు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు రావడంతో క్యాడర్ లోని కొందరికి మింగుడు పడక ఇతర పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సైతం లేకపోలేదు.

*కొత్వాల ప్రభావం వనమాపై చూపనున్నదా..?కొత్తగూడెం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వనమా వెంకటేశ్వరరావు మేనల్లుడు కొత్వాల శ్రీనివాసరావు ప్రభావం చూపనున్నదా..? అంటూ ఇటు పాల్వంచ అటు కొత్తగూడెంలో చర్చ మొదలైంది. అయితే పలువురు రాజకీయ సీనియర్ నేతలు

కొత్వాల వల్ల వెంకటేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో కొత్త ప్రభావం పడనున్నదని బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నో సంవత్సరాలుగా కొత్వాల శ్రీనివాసరావు వనమా వెంకటేశ్వరరావు వెంట ఉండి సేవలందించినప్పటికీ ఆయన బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కొత్వాల కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ బరిలో ఉన్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !