UPDATES  

 నాడు ఎట్లుండే గుండాల.. నేడు ఎట్లుంది గుండాల..అభివృద్ధి చేశా…

  • నాడు ఎట్లుండే గుండాల..
  • నేడు ఎట్లుంది గుండాల
  • అభివృద్ధి చేశా…
  • మాయగాళ్ల తో జాగ్రత్త
  • తరతరాలుగా గుండాల ప్రజలు పడే కష్టాలను తీర్చా
  • నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టె… హై లెవెల్ వంతెనలు చూశారు
  • పోడు భూములకు పట్టాలు వచ్చాయి
  •  నూనె పోస్తే ఎత్తుకునేలా బీ టీ రహదారులు అభివృద్ధి చేశా
  • బురద రోడ్లను సీసీ రోడ్లుగా మార్చా
  • గిరిజన బంధు కు కృషి చేస్తా
  • ఆలోచించి ఓటు వేయకపోతే మీ బతుకులు ఆగమే
  • కాంగ్రెస్ పాలనలో కటిక చీకట్లను అనుభవించాం
  • చీకట్లు ఇచ్చిన కాంగ్రెస్ కావాలా ?కరెంట్ ఇచ్చిన బిఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచన చేయాలి
  • బిఆర్ఎస్ కు అండగా నిలవండి
  •  బీ ఆర్ ఎస్ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు

*మన్యం న్యూస్ గుండాల*: నాడు ఎట్లుండే గుండాల నేడు ఎట్లుంది గుండాల అని పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు.శనివారం ఆయన గుండాల మండలంలో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి గుండాల ప్రజల కష్టాలను కల్లారా చూసా… వాగులు దాటా.. గుట్టలు ఎక్కా… మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాక మీ కష్టాలను నా కష్టంగా భావించి చెప్పులు అరిగేలా హైదరాబాద్ నగరంలో ప్రతి కార్యాలయం తిరిగా. పట్టుబట్టి నిధులు సాధించా..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో కోట్ల రూపాయల నిధులు తెచ్చి గుండాల మండలాన్ని అభివృద్ధి చేశా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాచనపల్లి, మామ కన్ను, ముత్తాపురం, గుండాల, లింగగూడెం, రోల్లగడ్డ, శంభుని గూడెం, శెట్టిపల్లి, గ్రామపంచాయతీలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పనిచేసే వారికి పట్టం కట్టండి పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధిలో నిలుపుతానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయం, వైద్య, విద్య రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం అని అన్నారు. ప్రతి కుటుంబ ఏదో రూపంలో ప్రభుత్వ సహాయం పొందుతున్నాయి మీరంతా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు

తెలంగాణ రాక ముందు మన బతుకులు ఎట్లా ఉండే తెలంగాణ రాకపోతే మన బతుకులు ఆగమైపోతుండే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని శవంతంగా అభివృద్ధి పథంలో నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పాలన ఎట్లా ఉందో తెలంగాణ లో ఎట్లుందో ప్రజలు ఆలోచించాలి ఆయన అన్నారు.స్వరాష్ట్రలో ఊరు వాడల ఎంతో అభివృద్ధి జరిగింది రోడ్లు వేసినం సిసి రోడ్ల నిర్మించిన వాగులపై వంతెనలు నిర్మించడంతోపాటు ప్రజలకు రహదారి సౌకర్యాన్ని ఎంతగానో మెరుగుపరిచానని అన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు.రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు రైతు బీమాను అమలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పథకాలు అమలవుతున్నాయని అన్నారు.రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతు బంధు ఎకరానికి మొదటి ఏడాది 12 వేల నుంచి ఐదు సంవత్సరాల కాలంలో 16 వేలకు పెంచి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు, రైతు బీమా పథకం ద్వారా లక్ష మందికి పైగా రైతులు లబ్ధి పొందాలని 73 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నారన్నారు.

మహిళ సాధికరతే లక్ష్యంగా ముందుకు రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు, సౌభాగ్య లక్ష్మి పథకంతో పేద మహిళలకు 3000 గౌరవ భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టో లో పేర్కొన్నారని దేశంలో ఎక్కడలేని విధంగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు స్వయం శక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషిపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా అత్యుధునిక వైద్యశాలలను ఏర్పాటు చేయడంతో పాటు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి సౌకర్యాలు కల్పించారని ఇప్పటివరకు పది లక్షల ఉన్న ఆరోగ్య బీమా గరిష్ట పరిమితిని కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకంతో 15 లక్షలకు పెంచి మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నార అన్నారు.ఆసరా పెన్షన్ తో చేయూతఆసరా పెన్షన్ తో అర్హులైన వారికి చేతన అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు 3000 ఉన్న పెన్షన్ ప్రతి సంవత్సరం పెంచుతూ 5000 ఇచ్చినందుకు చర్యలు  తీసుకున్నారన్నారు, అదేవిధంగా దివ్యంగులకు పెన్షన్ ఇటీవల నాలుగు వేలకు పెంచారని అని అన్నారు.రేషన్ పై సన్న బియ్యం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి  రేషన్ పై ఉన్న బియ్యం అందించినందుకు అన్నపూర్ణ పథకం మ్యానిఫెస్టో తో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని దీంతో 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి  చేకూరనున్నదన్నారు, అదేవిధంగా 400కే వంట గ్యాస్ అందించేందుకు సీఎం కేసీఆర్ గారు చర్యలు తీసుకున్నారు అని తెలిపారు అదే విధంగా అగ్రవర్ణ పేదలకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. సంక్షేమం ఆగొద్దు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ రావాలని పినపాక నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరాలని అన్నారు కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి పోలేటి భవాని శంకర్, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, సర్పంచ్ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి టి రాము, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు వట్టం రవి, కొరసాలయ్య, అటికం నాగేశ్వరరావు, కుమార్, తాటి కృష్ణ, జాడి ప్రభాకర్, భూక్య శ్రీను, పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !