మన్యం న్యూస్ ,వాజేడు :
మండల పరిధి మండపాక గ్రామం జాతీయ రహదారి పక్కనే ఒక మహిళ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపు తుండగా వాజేడు పోలీసులు మద్యం స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేశారు.వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం మండపాక వద్ద కుంచాల కోటమ్మ అనే మహిళ ఎన్నికల కోడ్ ఉల్లంఘన తొ బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మధ్యం విక్రఇస్తున్నట్లు సమాచారం మేరకు వాజేడు పోలీసులు దాడి నిర్వహించి సుమారు నాలుగు వేల రూపాయలు విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు ఎస్సై వెంకటేశ్వరావు మీడియాకు తెలిపారు. ఎన్నికల కోడ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా గుడుంబా, మధ్యం విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా దొంగసార,బెల్ట్ షాపుల వ్యాపారులు, అక్రమ మద్యం వ్యాపారులకు హెచ్చరికలు జారి చేశారు.