మన్యం న్యూస్ దుమ్ముగూడెం, నవంబర్ 18::
సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మండలంలోని ఎన్ లక్ష్మీపురం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరారు వారిని మండల అధ్యక్షులు గులాబి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తున్నారని అలానే భద్రాచలం నియోజవర్గ అభివృద్ధి మరింత జరగాలంటే స్థానికుడైనటువంటి డాక్టర్ తెల్లం వెంకట్రావుని అధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగవరం సర్పంచ్ సోడి కొండయ్య సొసైటీ డైరెక్టర్ బొల్లి వెంకట్రావు బిసి సెల్ అధ్యక్షులు బోల్లి శేఖర్ నాయకులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.