- బీఆర్ఎస్ తీర్థ పుచ్చుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు…
మన్యం న్యూస్,చండ్రుగొండ, నవంబర్ 18: మండల బీఆర్ఎస్ పార్టీల్లోకి పెద్ద సంఖ్యలో వలసలు వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోత్ శ్రీనివాస్ నాయక్ (గడ్డం శ్రీను) అన్నారు. శనివారం కర్సలబోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.వీరందరికి గులాబీ కండువా కప్పి శ్రీనివాస్ నాయక్ పార్టీలోకి సాధరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో అశ్వరావుపేట నుండి బిఆర్ఎస్ అభ్యర్ధి మెచ్చ నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఎన్నికల వస్తుంటాయి పోతుంటాయని ఆలోచించి పనిచేసే పార్టీకే ఓటు వేయాలన్నారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బానోత్ పెద్ద బాల్య, మాలోత్ లాలు, బానోత్ రాంబాబు, గుగులోత్ రాములు, బానోత్ హఠ్య, బానోత్ మోహన్, గుగలోత్ సర్వస్, బానోత్ మాలు, లావుడ్య రవి, ధరావత్ బిక్షం, లావుద్య విక్రం, బానోత్ బాలక్రిష్ణ, బానోత్ సురేష్, మూడ్ బిల్యా, లింగ్యు, మోహన్, రాజు లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ వీరన్న, రాందాసు,బానోత్ శంకర్, గుగులోత్ రాందాసు, తదితరులు పాల్గొన్నారు.