UPDATES  

 కాంగ్రెస్ పార్టీని నమ్మితే అధోగతే..బీఆర్ఎస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి..

  • కాంగ్రెస్ పార్టీని నమ్మితే అధోగతే*
  • బీఆర్ఎస్ కి ఒక్క అవకాశం ఇవ్వండి
  • భద్రాచలం బీ ఆర్ ఎస్ అభ్యర్థి డా.తెల్లం ని భారీ మెజారిటీతో గెలిపించండి
  • అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
  • యాదాద్రి వలే భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తాం
  • కరకట్టను నిర్మించే బాధ్యత మా ప్రభుత్వం చూసుకుంటుంది
  •  వెంకటాపురం కి జూనియర్ కళాశాల
  •  చర్ల మండలానికి అగ్నిమాపక కేంద్రం జూనియర్ కళాశాల మంజూరుకు కృషి
  • కెసిఆర్ మేనిఫెస్టో నూరు శాతం అమలు చేస్తాం
  • భద్రాచలం రోడ్డు షో లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
  • గులాబీమయమైన భద్రాచలం..
  • యువనేత కేటీఆర్ కి భద్రాచలం నియోజకవర్గం ప్రజల అపురూప స్వాగతం

మన్యం న్యూస్,భద్రాచలం:కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజల కు అధోగతే మిగులుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి మంత్రి కేటీఆర్ అన్నారు.

భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్సీ, భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం అభ్యర్థి‌ తెల్లం వెంకట్రావుతో కలిసి ఆదివారం భద్రాచలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంలో భద్రాచలం ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని భాగస్వామ్యం కావాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెల్లం వెంకట్రావు ని నియోజకవర్గ ప్రజలంతా చైతన్యవంతమైన తీర్పుతో అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.

*కాంగ్రెస్ పార్టీ నీ నమ్మి మరోసారి మోసపోవద్దు*

డబ్బు సంచులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను అంగడిలో సరుకు లాగా కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

భద్రాచలం గడ్డపై గులాబీ జెండా ఎగురవేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత కేసిఆర్ తీసుకుంటారని అన్నారు.

*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముళ్ళచెట్టు*

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముళ్ళ చెట్టు అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని అందజేసే పండ్ల చెట్లు.. ఏ చెట్టు కావాలో మీరే నిర్ణయించండి అని భద్రాచలం నియోజకవర్గ ఓటర్లను కోరారు.

*భద్రాచలం నియోజవర్గానికి వరాల హామిజల్లు కురిపించిన మంత్రి నేత కేటీఆర్*

రైతు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ముందుంటారు.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు గారిని భద్రాచలం శాసనసభ్యుడిగా గెలిపించండి.. ప్రతి మండలంలో ఒక కోల్డ్ స్టోరేజీ ‌ పరిశ్రమల శాఖ మంత్రిగా తీసుకునే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల విద్య కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ప్రతి మండలానికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వెంకటాపురం మండలంలో ఒక జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరగా వెంకటాపురం మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ మంజూరు కొరకు జీవో మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చారు.

చర్ల మండలానికి అగ్నిమాపక కేంద్రాన్ని, డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తాము.. అని హామీ ఇచ్చారు.భద్రాచలం రామాలయం అభివృద్ధి, కరకట్ట నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత తమ ప్రభుత్వంమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.యువనేత కేటీఆర్ రోడ్ షో సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో యువత పెద్ద ఎత్తున జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. నినాదాలతో హోరెత్తించారు. కేటీఆర్ రోడ్ షో విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !