- కేటీఆర్ రోడ్ షోలు ధూంధాం!
- ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం
- గిరిజన మహిళలు సైతం ఆటపాటలు
- సూపర్ బజార్లో హోరెత్తిన రామక్క పాట
- వనమా స్టెప్పులు.. మురిసిన బీఆర్ఎస్ శ్రేణులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలైన కొత్తగూడెం భద్రాచలం ఇల్లందు అశ్వరావుపేటలో ఆదివారం జరిగిన పురపాలక సంఘం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోలు ధూమ్.. దాంతో దుమ్ము రేపాయి. కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ లో మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాట్లాడడం జరిగింది. ఆయన ప్రసంగం గులాబీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. కేటీఆర్ రాక సందర్భంగా సూపర్ బజార్ ఏరియాలో ఆదివాసులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గిరిజనులు సైతం ఆటపాటలతో సందడి చేశారు. నడవ నడవ నడవవే రామక్క.. కలిసి నడువు గట్టవే రామక్క అనే పాటకు ఆదివాసీల మహిళలతో కలిసి కొత్తగూడెం అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు వేసిన స్టెప్పులు గులాబీ శ్రేణులను మురిపించాయి. ఏది ఏమైనా రామక్క పాట సూపర్ బజార్ ఏరియాలో దద్దరిల్లిపోయింది.