మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 19: ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ దేయమని ఆలోచించి చేసినా అభివృద్ధినీ చూసి ఆదరించాలని బీఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావు అన్నారు. ఆదివారం అశ్వారావుపేట మండలంలో అంగరంగ వైభవంగా వందలాది వాహనాలతో నారం వారి గూడెం కాలనీ, నారం వారిగూడెం, అచ్చుతాపురం, మద్దికొండ, జమ్మిగూడెం, కేశప్పగూడెం, ఉట్లపల్లి, వేదాంతపురం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రగతిని సాధిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రజలు ఆలోచించాలని ఆలోచించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన పరిస్థితి ఏంటో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి ప్రగతిని సాధించాము మీకు తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అంధకారంలో ఉండేదని ఆనాడు సంక్షేమ పథకాలు 1000 లో ఒక్కరికి మాత్రమే దక్కేవని నేడు సంక్షేమం అంటే ప్రతి ఇంటి గడపను తట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేశానో మీరు గమనించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఇస్తున్నారనీ ఆనాడు చేయలేని వాళ్ళు ఈనాడు చేస్తారా అని అన్నారు. ఎన్నికల సమయంలో నాయకులు వస్తుంటారని వాళ్ళు ఇచ్చే హామీలు గతంలో కానీ భవిష్యత్తులో కానీ చేసే సత్తా ఉన్న నాయకులేనా అని ప్రజలే ఆలోచించాలని కోరారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే నాయకులను నమ్మి ఆగం కావద్దని ఆయన కోరారు. అభివృద్ధికి సహకరించే నాయకుల ఎవరు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని అందించిన నాకు మరో అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమలలో స్థానిక మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.