మన్యం న్యూస్ ,భద్రాచలం: భద్రాచలంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం అభ్యర్థి డా. తెల్ల వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ రోడ్డు షో కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సారపాక బిపిఎల్ స్కూల్ ల్యాండ్ కావడం జరిగింది.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.