మన్యం న్యూస్, కారేపల్లి:
పురుగుమందు త్రాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలం బోటితండా ఆదివారం చోటుచేసుకుంది. కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.బోటితండాకు చెందిన గుగులోత్ సైదులు(27) అవివాహితుడు. అతని మనసికస్ధితి సరిగా ఉండటం లేదు.దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం పురుగుమందు త్రాగి రోడ్డుపై పడి ఉన్నాడు. లేకుండా రోడ్డుపై పడి ఉన్న సైదులును చూచిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు కబురు చేయటంతో వారు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి కుటుంబసభ్యులు పిర్యాదు మేరకు కారేపల్లిఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.