UPDATES  

 అశ్వరావుపేట రోడ్ షోలో జనం ప్రభంజనం.. కాంగ్రెస్ పార్టీపై ఘాట్ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..

  • అశ్వరావుపేట రోడ్ షోలో జనం ప్రభంజనం
  • కాంగ్రెస్ పార్టీపై ఘాట్ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
  • ఎన్నికల తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అశ్వరావుపేటకి ఎమ్మెల్యే మెచ్చా -కెటిఆర్
  • అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణనీ దోచుకోవడానికి దొంగలు మాయమాటలతో వస్తున్నారు -కేటీఆర్

మన్యం న్యూస్, అశ్వరావుపేట, నవంబర్, 19: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ను దోచుకోవడానికి మాయమాటలతో కొందరు నాయకులు వస్తుంటారని, నమ్మవద్దని అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో రోడ్ షో లో కేటీఆర్ అన్నారు. ఆదివారం అశ్వరావుపేట నియోజకవర్గం స్థానిక రింగ్ రోడ్ కూడలి వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రోడ్ సోలో పాల్గొని ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలని. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దోచుకోవడానికి కొందరు నాయకులు మాయమాటలతో వస్తుంటారని నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చేసినా అభివృద్ధి ఏమీ లేదని, ఈనాడు 24 గంటలు కరెంటు ఇస్తుంటే కరెంటు లేదంటూ కళ్ళబుల్లి మాటలు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తుంటే, ఓర్వలేక పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్, అశ్వరావుపేట లో ఎమ్మెల్యే మెచ్చా పోడు భూములకి పట్టాలి ఇచ్చిన ఘనత దక్కుతుందని, దాదాపు 26 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ప్రతి మండల కేంద్రంలో డివైడర్లు ఏర్పాటు చేసుకున్నాం అని, సెంటర్ లైటింగ్ లు మంజూరు చేయడం జరిగిందని, అన్నపురెడ్డిపల్లి మండలాన్ని కొత్త మండలంగా ఎమ్మెల్యే మెచ్చా అభ్యర్థన మేరకు తెలియజేయడం జరిగిందని అన్నారు. దాదాపు 80 శాతం గ్రామాలలో సిసి రోడ్లు వీటి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే మచ్చ కృషి పలంగా 100 కోట్లు నిధులతో డ్యూటీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. పామల్ ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచుకున్నామని, అశ్వరావుపేటలో 30 పడుకుల ఆసుపత్రిని 100 ఆసుపత్రి పడకలుగా తీర్చిదిద్దామని, ఆర్టీవో సబ్ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని, గూడాలను తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగిందని, దమ్మపేటలో మెజిస్ట్రేట్ కోర్టును ఏర్పాటు చేసుకున్నామని ఇలా అభివృద్ధి మరింత జరగాలంటే మెచ్చాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రతి ఒక్క ఓటరు కూడా కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడానికి తోడ్పడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణారావు, రైతుబంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి, సున్నం నాగమణి, బానోత్ పద్మావతి, వర్గెల పూజ, భూక్య ప్రసాదరావు, సోయం వీరభద్రం, జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !