UPDATES  

 ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.నిరుద్యోగులకు నవ లిమిటెడ్ సేవలు వరం.. జిల్లా ఉపాధి శాఖాధికారిణి వి.విజేత..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:

పాల్వంచ నవ లిమిటెడ్ సంస్థాగత సంఘసేవా కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన మహిళా సాధికార కేంద్రంలో 70వ అఖిల భారత సహకార

వారోత్సవాలు డి.టి.పి ట్యాలీ, బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యోగ్యత పత్రాల బహుకరణ కార్యక్రమాన్ని

నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి శాఖాధికారిణి వి.విజేత, కాకతీయ కోపరేటివ్ ట్రైనింగ్ కాలేజ్ వరంగల్ పి.రాజయ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.రాజయ్య మాట్లాడుతూ 70వ అఖిల భారత సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను, కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.

డి.టి.పి కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్ధిణి నిఖిత మాట్లాడుతూ ఉద్యోగంలో భాగంగా ఈ కోర్సు చేయటం అవసరం అయిందని

కాని వేల రూపాయల ఫీజు కట్టి నేర్చుకోవటం గురించి ఆలోచిస్తున్నప్పడు

నవ లిమిటెడ్ ఈ కోర్సు ఉచితంగా అందిస్తున్నరని తెలిసి డి.టి.పి

కోర్సులో చేరటం జరిగిందన్నారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న అనంతరం తనకు

ఉద్యోగంలో ప్రమోషన్ లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వి.విజేత మాట్లాడుతూ

మహిళా సాధికార కేంద్రం ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఇస్తున్న వివిధ

శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవడం ద్వారా యువతీయువకులు శిక్షణ

అనంతరం ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలని పేర్కొన్నారు. ఉపాధికి కావలసిన సహాయ సహకారాలు

అందించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆడ్మినిస్ట్రేటర్ సి.యస్.ఆర్ డి.శ్యామ్ సుందర్,

టి.అరుణ, అముద, వాసవిరాణి, అరుణ, దివ్య, యం.శ్రీనివాసరావు, శ్రీకాంత్,

రాజేశ్వరరావు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం తాటి ఆకుల ఉత్పత్తులు నవ లిమిటెడ్ కార్మిక సిబ్బందికి యూనిఫామ్స్ కుట్టడం ద్వారా వచ్చిన నగదును నవయుగ మహిళా త్రిఫ్ట్ సోసైటి ద్వారా మహిళలకు చెక్కులను పంపిణి చేయటం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !