- అభివృద్ధి చేశా… ఆధరించండి…మరో అవకాశం ఇవ్వండి…
- అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…
- బ్రహ్మరథం పట్టిన బిఆర్ఎస్ శ్రేణులు…
మన్యం న్యూస్,చండ్రుగొండ, నవంబర్ 20: అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరో సారీ అవకాశం ఇవ్వాలని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఓటర్లను కోరారు. సోమవారం చండ్రుగొండ మండల పరిధిలోని సీతాయిగూడెం, తిప్పనపల్లి, రేపల్లెవాడ, గానుగపాడు, తుంగారం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఓటర్లు, బిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మేల్యే మెచ్చా కు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, కోలాట బృందాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ….. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పోడు రైతులకు రైతుబంధు, రైతుభీమా కల్పించిన ఘనత సిఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. గిరిజన, గిరిజనేతరులకు సైతం పోడు పట్టాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయటంలో సిఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వగ్గెల పూజిత, భూక్య ప్రసాద్, దారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, కొణకండ్ల వెంకటరెడ్డి, సయ్యద్ రసూల్,మేడా మోహన్ రావు, సురా వెంకటేశ్వర్లు, నరకుల్లా సత్యనారాయణ, సత్తి నాగేశ్వరరావు, తలారి నాగరాజు, అంజన రావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.