మన్యం న్యూస్ అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు,ఎంపిటిసి,ప్రముఖ న్యాయవాది పోరెడ్డి విజయలక్ష్మి సోమవారం పినపాక నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగ కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు రాజకీయాల అతీతంగా బిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ అభివృద్ధిని చూసి ప్రజలంతా బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని పేదల సంక్షేమ విషయంలో సీఎం కేసీఆర్ రాజీ పడే ప్రసక్తే లేదని పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది అన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులకు హక్కును చేర్చుకున్నారని ఆయన అన్నారు మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని పథకాలు తీసుకువస్తారని తెలిపారు.కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగంట్ల వీరభద్రం,ఎంపీటీసీ దుర్గభవాని, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జునరావు, సూదిరెడ్డి గోపిరెడ్డి, తూము రాఘవులు, మాజీ జెడ్పిటిసి తోకల లత తదితరులు పాల్గొన్నారు.