- బాధ్యతాయుతమైన బరోసా బీఆర్ఎస్ మానిఫెస్టో
- ఆచరణ సాధ్యం కాని అతి.. కాంగ్రెస్ మానిఫెస్టో
- ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్
మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలంలోని సుదిమల్ల, పూబెల్లి, మొండితోగు, విజయలక్ష్మి, తిలక్ నగర్, చల్ల సముద్రం, రేపల్లె వాడ గ్రామపంచాయతీలలో ఇల్లందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ గ్రామానా పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు, హరిప్రియ నాయక్ కు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళ హరతులతో ఘన స్వాగతం పలికారు. నేటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, అందిస్తున్న సంక్షేమ పథకాలను హరిప్రియ ప్రజలకు వివారించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారెంటీ కార్డును ప్రజలు నమ్మవద్దని అన్నారు. గతంలో ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ మౌలిక సదుపాయాలు ఐన మంచినీరు, కరెంటు, రోడ్లు ప్రజలకు అందించలేక పోయింది. నేడు ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని అన్నారు. బాధ్యతాయుతమైన బిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోతోనే ప్రజలకు భరోసా అన్నారు. మన సమస్యలు మనమైతేనే పరిష్కరించుకో గలుగుతాం అన్నారు. కారు గుర్తుకు ఓటేసి కెసిఆర్ సారును గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆదరిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కేసిఆర్, కేటీఆర్ ల సహకారంతో ఇల్లందు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, ఇల్లందు మండల జడ్పిటిసి ఉమాదేవి, మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, మండల కో ఆప్షన్ ఘాజి, ఉపాధ్యక్షులు బానోత్ రమేష్, సొసైటీ డైరెక్టర్ లస్కర్, రైతు కోఆర్డినేటర్ పూణే కమల, బానోతు హనుమ, కాంతారావు, బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.