- పూల వర్షం కురిసిందా….
- పినపాక బీ ఆర్ ఎస్ అభ్యర్థి రేగ కాంతారావుకు బ్రహ్మరథం
- మంగళ హారతులు తో ఆశీర్వదించిన సోదరీమణులు
- నృత్యాలతో స్వాగతం పలికిన యువతులు, మహిళలు
- పూలు జల్లుతూ అభిమాన నాయకుడు రేగాపై ఆప్యాయత చాటుకున్న మహిళలోకం
మన్యం న్యూస్,పినపాక: మండలంలో సోమవారం నిర్వహించిన పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలు వర్షం కురిపిస్తూ అభివృద్ధి ప్రదాత ,పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు పై అభిమానం చాటుకున్నారు. మండల పరిధి తో గూడెం పంచాయతీ గోవిందపురంలో ప్రారంభమైన రేగా కాంతారావు రోడ్డు షో తో గూడెం,,గోపాలరావు పేట,మారేడు గూడెం, పినపాక, బోటిగుడెం, నారాయణపురం, మడతన కుంట,సీతంపేట,ఎల్చిరెడ్డి పల్లి, ఏడూళ్ల బయ్యారం తదితర గ్రామాల్లో కొనసాగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రేగా కాంతారావును ఆశీర్వదించారు. రేగా కాంతారావు రోడ్ షోకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో మండల బీఆర్ఎస్ శ్రేణులు జోష్ నెలకొంది.