మన్యం న్యూస్ ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం బట్టీలగుంపు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన దళితుల సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గం ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్.ఈ సందర్బంగా వెన్న అశోక్ కుమార్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లోని ఉన్న అన్ని దళిత కుటుంబాలకు “పైలెట్ ప్రాజెక్టు”కింద 100 శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఎటువంటి బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా తమకు నచ్చిన, నైపుణ్యం కలిగిన ఆర్థిక యూనిట్లను నెలకొల్పుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రేగా కాంతారావు ని అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బట్టీలగుంపు గ్రామశాఖ అధ్యక్షులు పాయం సత్యనారాయణ,మండలం ఎస్సి సెల్ ప్రధానకార్యదర్శి వల్లెపోగు రాము,దుబాక బాబురావు, ఇనపల్లి రవి,సందీప్, శ్రీకాంత్,శశి, సామంత్,వార్డు మెంబర్స్,యువజన నాయకులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
