UPDATES  

 కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..ప్రాథమిక సభ్యత్వానికి మాజీ అధ్యక్షులు,నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ గురజాల గోపి రాజీనామా..

 

  • బడా బాబుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది
  • కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని వారు కూడా నాయకులుగా చలామణి

 

మన్యం న్యూస్ మణుగూరు:

 

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,పినపాక నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ గురజాల గోపి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వారు తెలిపారు.ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవలందించాను అని, అధిష్ఠానం పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లు,తుళ్ళురి బ్రహ్మయ్య మా సేవలను గుర్తించక పోవడం చాల భాదకరం అని అన్నారు.మాజి కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఆశీస్సులతో ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టిలో పని చేశామని తెలిపారు.రేణుకా చౌదరి తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు అన్నారు.అలాంటి నన్ను స్థానిక నాయకులు గుర్తించకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. అదిష్టానం నన్ను పినపాక నియోజకవర్గం ఎలక్షన్ కోఆర్డినేటర్ గా నియమించిందని ఈ విషయం పై పాయం వెంకటేశ్వర్లు నీ కలిస్తే తరువాత మాట్లాడదం అన్నారని,తుళ్ళూరి బ్రహ్మయ్య ను కలిస్తే డీసీసీ ఇవ్వాలి కాని, పీసీసీ ఎవరు ఇవ్వడానికి అని కించపరిచే విధంగా నీచాతి నీచంగా మాట్లాడారు అన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తులు నేడు పార్టీ కోసం పనిచేసిన వారిని కించపరచడంతో మనోవేదనకు గురి అయ్యానని,ఆవేదన వ్యక్తం చేసారు.సమయం కొసం ఎదురు చుసానని,మార్పు వస్తుందేమోనని ఓపికతో ఎదురు చూశామని,అయినా మార్పు రాలేదని,కాంగ్రెస్ పార్టీ లో సభ్యత్వం లేనివారు కూడా పెత్తనాలు చేస్తున్నారని, నాయకులుగా,సీనియర్లకు గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు.నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటా వచ్చిన మాకే స్థానం లేకుండా చేసారని, బడాబాబుల చేతుల్లోనికి కాంగ్రెస్ పార్టి పోయిందని అన్నారు.కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని ఆ విషయంలో నాకు చాలా బాద కలిగిందన్నారు.అందుకే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తునట్లు గురజాల గోపి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !