UPDATES  

 ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం..

  • ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం!
  •  కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం
  •  మీరు ఎన్నికల్లో విధుల్లో ఉండాలే ఇక్కడ మీకేంటి పని
  •  చుంచుపల్లి పోలీస్ అధికారిపై చిందులు
  •  సీనియర్ జర్నలిస్ట్ పై సిపిఐ నేత రుస రుస

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

ఈ ఒక్కరోజు ఆగండి మేమేంటో చూపిస్తాం.. కూనంనేని సాంబశివరావు గెలిస్తే చక్రం తిప్పుతాం.. మీరు ఎన్నికల్లో విధుల్లో ఉండాలే ఇక్కడ ఎందుకు ఉన్నారు.. ఇక్కడ మీకేం పని అంటూ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ అధికారిపై చిందులు వేయడంతో పాటుగా.. ఒక సీనియర్ జర్నలిస్టుపై చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీకి చెందిన సిపిఐ లీడర్ ఆగ్రహంతో ఊగిపోయి రుస రుసలాడడం శనివారం చర్చనీయాంశంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రక్కనే ఒక వ్యక్తి

కమర్షియల్ వ్యాపారం చేసుకునేందుకు బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. బిల్లింగ్ నిర్మించుకునేందుకు పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. పైగా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టాడు. ఈ నిర్మాణ పనులపై కొందరు పంచాయతీ అధికారులకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారి నిర్మాణ పనులు జరిగే ప్రదేశానికి వద్దకు వచ్చి పనులను నిలుపుదల చేయించడం జరిగింది. విషయాన్ని జర్నలిస్టులు తెలుసుకుంటున్న క్రమంలో వెంటనే సిపిఐ లీడర్ ఎంటరై ముందుగా

పోలీస్ అధికారిని ఇక్కడ మీరు ఎందుకు ఉన్నారు..? మీరు ఎన్నికల విధుల్లో ఉండాలే.. ఇక్కడ మీకేంటి పని అని చిందులు తొక్కాడు. అక్కడ ఉన్న జర్నలిస్టులలో ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా జరుగుతున్న నిర్మాణ పనులపై ప్రశ్నిస్తే సిపిఐ లీడర్ ఆగ్రహంతో ఊగిపోయి రుస రుసలాడడం విస్మయానికి గురిచేసింది. అంతేకాకుండా ఈ ఒక్కరోజు ఆగండి తర్వాత మీమేంటో చూపిస్తామంటూ హెచ్చరించడం పట్ల అక్కడున్న వారంతా బిత్తర పోయారు. కూనంనేని గెలిస్తే మాదే రాజ్యం అన్నట్లుగా ఆ సిపిఐ లీడర్ వ్యవహరించాడని ఇది సరైంది కాదని నిర్మాణ ప్రదేశం వద్ద ఉన్న కొందరు మాట్లాడుకోవడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలను పాటించకుండా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారుడుకి సిపిఐ లీడర్ కొమ్ముకాస్తున్నట్లుగా జరిగిన ఘర్షణ బట్టి చూస్తే స్పష్టంగా అర్థమైందని పలువురు పేర్కొనడం గమనార్హం. ఇది ఇలా ఉండగా సీనియర్ జర్నలిస్ట్ పై సిపిఐ లీడర్ పైపైకి దూసుకు రావడం వాగ్వాదానికి దిగడాన్ని తోటి జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా డ్యూటీలో ఉన్న చుంచుపల్లి పోలీస్ అధికారిని సిపిఐ లీడర్ ఇక్కడ మీకేంటి పని అని ప్రశ్నించడాన్ని పలువురు తప్పుపట్టారు. ఏది ఏమైనప్పటికీ సిపిఐ లీడర్ ఇటు పోలీస్ అధికారిపై అటు జర్నలిస్టుపై దురుసుగా.. దూకుడుగా వ్యవహరించడం పట్ల భద్రాద్రి జిల్లా కేంద్రంలో చర్చ నియాంశంగా మారింది.

*అక్రమ బిల్డింగ్ నిర్మాణ పనులపై చర్యలు తీసుకోవాలి…*

చుంచుపల్లి మండలం విద్యానగర్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన జరుగుతున్న అక్రమ నిర్మాణ బిల్డింగ్ పనులను నిలిపివేసి నిర్మాణ దారుడుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివ శంకర్ డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా ఈ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు స్పందించి వాటిపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించిన జర్నలిస్ట్ పై చుంచుపల్లి సిపిఐ నాయకుడు దురుసుగా మాట్లాడడం సరైంది కాదన్నారు. పై పెచ్చు ఈ ఒక్కరోజు ఆగండి రేపటినుండి మీమేంటో చూపిస్తామని హెచ్చరించడాన్ని ఆయన తప్పుపట్టారు.‌

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !