మన్యం న్యూస్, మంగపేట.
ములుగు నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్నికలు వస్తూంటాయి, పోతుంటాయి, ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం.బి ఆర్ ఎస్ గెలుపు కోసం నా శాయ శక్తుల కృషి చేశాను. ములుగు ప్రజలు కూడా నీరజనాలు, మంగళహారతులు ఇచ్చారు కానీ ఎందుకో తిరస్కరించారు, అయినా కూడా ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటాను. ప్రజల సమస్యల పై పోరడుతాను. బిఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించిన అన్నలకు అక్కలకు, తల్లులు, తండ్రులు, తమ్ముళ్లు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి,పేరు పేరు నా కృతజ్ఞతలు చెబుతున్నాను. ములుగు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నిలబడి గెలిచిన సోదరి సీతక్క కు శుభాకాంక్షలు చెబుతున్నాను. నేను నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే పని చేస్తా, ప్రజల తోనే ఉంటా అని బడే నాగజ్యోతి తెలియజేశారు.