అమెరికాలో చదువుతున్న భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులకు అమెరికా శుభవార్త తెలిపింది. ఎఫ్ 1 వీసాతో యూఎస్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇమిగ్రెంట్ వీసాకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్ 1 వీసాతో ఉపాధి- ఆధారిత కేటగిరిలో ఇకపై ఇమిగ్రెంట్ వీసాకు నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇమిగ్రెంట్ వీసా పొందిన విద్యార్థులు యూఎస్‌లోని స్టార్ట్‌అప్‌లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.
