UPDATES  

 ఏజెన్సీ పై చలి పులి పంజా..

 

మన్యం న్యూస్ చర్ల

భద్రాద్రిజిల్లాలోని చర్ల ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఒకవైపు పొగ మంచు అధికంగా కురుస్తూ మరొకవైపు చల్లని ఈదురు గాలులు వీచడంతో ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రజలు గజగజ వణుకిపోతున్నారు. రోజురోజుకు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు ఔతూ వస్తున్నాయి. ఉదయాన్నే ప్రయాణించే వాహనదారులు పొగ మంచుతో తీవ్ర అవస్థలు పడుతూ ప్రాణప్రాయంగా ప్రయాణించవలసి వస్తున్నది. దీనిపై అధికారులు స్పందిస్తూ ఉదయాన్నే లేచి వాకింగ్ జాగింగ్ చేసే పాదా చారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం 9 గంటల వరకు ఇంట్లో నుంచి బయటికి రావద్దని అత్యవసరమైతే తప్ప మిగతా టైం లో బయటికి రావద్దనీ శీతల గాలులు పొగ మంచం నుంచి స్వెటర్స్ ఉపయోగించుకోవాలని, వాహనదారులు హెడ్ లైట్ ఆన్ లో ఉంచి నిదానంగా ప్రయాణించాలని పలు సూచనలు ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !