UPDATES  

 విద్యుత్ ఉద్యోగులందరికీ జిపిఎఫ్ అమలు చేయాలి..డిప్యూటీ సీఎం భట్టి కీ వినతి పత్రం ఇచ్చిన కార్మిక సంఘం 1535 నాయకులు..

 

మన్యం న్యూస్, పినపాక:

 

విద్యుత్ ఉద్యోగులందరికీ జీపీఎఫ్ అమలు చేయాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చెందిన కార్మిక సంఘం-1535 నాయకులు కోరారు. మణుగూరులోని బి.టి.పి. ఎస్ కర్మాగార సందర్శనకు శనివారం వచ్చిన ఆయనను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఏ వజీర్, ప్రధాన కార్యదర్శి డి. రాధాకృష్ణ, జన్కో అధ్యక్షులు పి.రాము తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. జీ.వో నెంబర్ -119 అనుసరించి కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. జీవో నెంబర్- 6 ను రద్దుచేసి సెకండ్ డిపెండెంట్ జాబ్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. కేటీపీఎస్ పాత ప్లాంట్ నుంచి బి టి పి ఎస్, వై టి పి ఎస్ కు పంపించిన కార్మికులను తిరిగి కే.టీ. పీ.ఎస్ ఐదు, ఆరు, ఏడోదశ లకు బదిలీ చేయాలని కోరారు. కూల్చివేసిన కేటీపీఎస్ పాత ప్లాంట్ స్థానంలో నూతనంగా మరో విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సూచించారు. కొత్తగా నిర్మితమైన బిటిపిఎస్, వైటీపీఎస్,పులిచింతల కర్మాగారాల్లో శాంక్షన్డు పోస్ట్లు మంజూరు చేయాలని కోరారు.2013 సంవత్సరంలో చేరిన కార్మికులకు ఇప్పటివరకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్లకు ప్రస్తుతం ఇస్తున్న స్టాండర్డ్ రూల్స్ రద్దుచేసి ఏపీ ఎస్ ఈ బి రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ బి టీ పి ఎస్ రీజన్ అధ్యక్షులు వి. ప్రసాద్ ప్రధాన కార్యదర్శి రామచందర్ రాష్ట్ర నాయకులు ఎం.శ్రీధర్, అంబాల శ్రీను, అయిత వెంకటేశ్వర్లు, సిద్దెల హుస్సేన్, తుంపూరి అనిల్, చిక్కా వెంకటరమణ, శ్రీహరి, తోట గోపి, రవిచంద్ర, వీరబాబు మహిళా నాయకురాలు సునీత, రమణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !