అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్లో భారీగా సందర్శకుల తాకిడి పెరిగింది. మాడగడ,వంజంగి మేఘాల కొండలకు సందర్శకులు చేరుకుని సందడి చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. సూర్యోదయాన్ని లేలేత కిరణాలను ఆస్వాదిస్తూ మంచు మేఘాల మధ్య నుంచి ఉదయిస్తున్న భానుడిని చూస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.