UPDATES  

 కలెక్టర్ అమ్మ ఇది ఎక్కడి న్యాయం.కారం చెడు దారుణాలను తలపించేలా ములుగు జిల్లా కలెక్టర్ వ్యవహారాలు..

  • కలెక్టర్ అమ్మ ఇది ఎక్కడి న్యాయం
  • కారం చెడు దారుణాలను తలపించేలా ములుగు జిల్లా కలెక్టర్ వ్యవహారాలు
  • చట్టాలకు విరుద్ధంగా సర్వీసు రూల్స్ ని బేకాతర్ చేసిన వైనం
  • మూడు నెలల్లో రిటైర్ అవ్వబోతున్న దళిత తహసిల్దార్ పై వివక్ష చూపుతున్న జిల్లా అధికారులు.
  • రిటైర్ అవ్వడానికి మూడు నెలలు ఉండగానే ట్రాన్స్ఫర్ చేసిన జిల్లా కలెక్టర్

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

తరతరాలుగా దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు.

ఎంతోమంది హేమహేమీలు మహానుభావులు అంబేద్కర్ లాంటివారు కుల నిర్మూలనకు ఎంతో పాటుపడి శ్రమించి రాజ్యాంగాన్ని తయారుచేసి చదువుతోని బతుకుల కోసం హక్కుల కోసం పోరాటం చేయొచ్చు అధిగమించవచ్చు అనే విధంగా రూపకల్పన చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి జిల్లా కలెక్టర్ బ్రేక్ లేసారా . అంటే వేశారనే చెప్పాలి వివరాల్లోకి వెళితే వెంకటాపురం మండల కేంద్రంలో తాసిల్దారుగా విధులు నిర్వహిస్తున్నటువంటి సమ్మయ్య 61అనే దళిత ఎమ్మార్వో ని అతని రిటైర్మెంట్ మూడు నెలలు ఉండగానే జిల్లా కలెక్టర్ వెంకటాపురం నుండి ములుగు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు ఆలోచింపజేస్తున్నాయి.గవర్నమెంట్ రూల్ ప్రకారం రిటైర్మెంట్ అవ్వడానికి ఆరు నెలలు ఉన్న ఏ అధికారినైనా బదిలీ చేయడానికి లేదు. అది పూర్తిగా చట్టానికి విరుద్ధం.ప్రభుత్వం నిబంధన సర్వీస్ రూల్ ప్రకారం నేరం కూడా. కానీ రూల్స్ కి విరుద్ధంగా నన్ను ములుగు కు బదిలీ చేయడం పట్ల చాలా శోభన అనుభవిస్తున్నాను అని. ఎమ్మార్వో సమ్మయ్య వాపోయారు. అంతేకాకుండా డిప్యూటీ తాసిల్దార్ రేంజి ఉన్న మహమ్మద్ సర్వర్ను వెంకటాపురంలో ఎమ్మార్వో గా నియమించడంపై నాకు కారంచేడు గ్రామం లో 30 మంది దళితులనునరికి చంపిన ఘటన కలెక్టర్ నా పట్ల చూపిస్తున్న వివక్ష ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తుందని ఎంఆర్ఓ తన బాధను తెలిపారు. ఒక మండల తాసిల్దార్ గా నేను మణిపూర్ దళిత స్త్రీలను వస్త్ర హీనులు చేసి రోడ్డుమీద ఊరేగించినంత అవమానాన్ని నేను ఎదుర్కొంటున్నాను అని ఈ విషయం పట్ల తన గోడు ను విలపించాడు. ట్రాన్స్ఫర్ అయిన గత నాలుగు రోజుల నుంచి బయటికి చెప్పలేక దాచుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో క్యూ న్యూస్ ని ఆశ్రయించారని వారు తెలిపారు.

చివరి మూడు నెలలు అయినా ఒక దగ్గరే ఉండి రిటైర్మెంట్ తీసుకుందామనుకుంటే 61 ఏళ్ల వృద్ధుడిని అని కూడా నన్ను చూడకుండా అటు ఇటు ట్రాన్స్ఫర్లు బాధను కల్పిస్తున్నాయని వారి బాధను వ్యక్తం చేశారు . అడిగితే

లేనిపోని ఆరోపణలు తనమీద వేస్తూ ఎమ్మార్వో నని చూడకుండా వివక్షకు గురి చేస్తున్నారు అని మీడియా ప్రతినిధి వద్ద కన్నీరు పరవంతమయ్యారు . నేటికీ అడుగడుగునా జరుగుతున్న ఈ సామూహిక దాడి పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి దళిత ఎమ్మార్వో పై జరిగిన ఇటువంటి మానసిక అవరోధాల నుండి కాపాడే విధంగా జరిగిన విషయాన్ని పట్ల చర్యలు తీసుకోవాలని, తాసిల్దార్ సమ్మయ్యను వెంటనే వెంకటాపురం మండలంలోని విధులు నిర్వహించేలా అడుగులు వేయాలని అటు ప్రజలు ఇటు దళిత సంఘాలు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !