సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదలై భారీ విజయం అందుకున్న మూవీ హనుమాన్. ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న హనుమాన్ టీమ్ తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా హనుమాన్ సినిమా గురించి సీఎం యోగికి ప్రశాంత్ వర్మ వివరించారు.