అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై యాంకర్ రష్మి ఆనందం వ్యక్తం చేస్తూ ఇటీవల ట్వీట్ చేసింది. అయితే దీనిపై ఓ నెటిజన్ ‘అసభ్యకర పనులు చేసి భగవంతుడి నామాన్ని జపిస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయా.?’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. దీనిపై రష్మి ఫైర్ అయింది. ‘నేనేమైనా డబ్బులు ఎగ్గొట్టానా? కుటుంబ బాధ్యత మరిచి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశానా? ట్యాక్సులు చెల్లించడం లేదా? చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నానా?’ అని బదులిచ్చింది.