UPDATES  

 భారత్, ఫ్రాన్స్, యుఏఈ వైమానిక విన్యాసాలు….

భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా డెసర్ట్ నైట్‌ ఎక్సర్‌సైజ్ (EX- Desert Knight) పేరుతో భారీ వైమానిక విన్యాసాలు చేపట్టాయి. మూడు దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్‌లు ఈ ఎక్సర్సైజ్‌లో పాల్గొన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన Su-30 MKI, MiG-29, జాగ్వార్, AWACS, C-130-J, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ (FASF)కు చెందిన రఫేల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్‌పోర్ట్, UAE వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

 

మూడు దేశాల వాయుసైన్యం మధ్య సమన్వయం, పరస్పర సహకారం మెరుగుపరచుకునే ఉద్దేశంతో.. ఈ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) వెల్లడించింది. ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యద్ధ విమానాలు యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఆపరేట్ చేయగా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానాలు.. భారత ఎయిర్ బేసస్ నుంచి ఆపరేట్ చేశారు. ఇటువంటి వ్యాయామాలు IAF పరాక్రమాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఈ ప్రాంతంలో పెరుగుతున్న దౌత్య, సైనిక పరస్పర చర్యలను సూచిస్తాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !