ఇటీవల ఒక చిన్న సినిమాగా రిలీజై ఎవరూ ఊహించని ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీసు దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం భారీ ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్లు వసూళ్ళు రాబట్టింది. క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ నటుడు తేజ సజ్జా హీరోగా నటించాడు.
ఇదిలా ఉంటే తాజాగా అయోధ్య ప్రారంభోత్సవం కార్యక్రమం రోజున ఈ మూవీ సీక్వెల్‌ను దర్శకుడు ప్రశాంత్ ప్రకటించాడు. ఈ సీక్వెల్ మూవీకి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశాడు. అంతేకాదు ఈ మూవీలో తేజ సజ్జా హీరో కాదని.. మరో స్టార్ హీరోను ఆంజనేయుడి పాత్రలో కథానాయకుడిగా పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ప్రేక్షకాభిమానులంతా ఈ సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఈ సీక్వెల్ మూవీలో ఆంజనేయుడి పాత్రలో నటించే స్టార్ హీరో ఇతడే అంటూ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పేరు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. రానా కూడా ఆంజనేయుడి పాత్రలో బాగా సెట్ అవుతాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.