UPDATES  

 నితిన్ కొత్త మూవీ టైటిల్ లీక్.. పేరు అదిరిపోయింది..!

ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 

ఇందులో భాగంగా ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారు. కానీ ఆమె ఈ షూటింగ్ నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్‌‌ కేరళలో హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.

 

కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను జనవరి 26న అంటే రేపు ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ టైటిల్ తాజాగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ మోసగాడి పాత్రలో కనిపించబోతున్నాడు. కావున ఆ పాత్రకు తగ్గట్టుగా ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !