కేంద్ర ప్రభుత్వం తాజాగా 34 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురికి అవార్డులు వరించాయి. తెలంగాణకు చెందిన బుర్ర వీణ వాయిద్య కారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. అలాగే దేశంలోని వివిధ కళల విభాగంలో 31 మందికి పద్మశ్రీని ప్రకటించింది