తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హను మాన్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విజయంలో కథ.. కథనం.. గ్రాఫిక్స్ తో పాటు ఫైట్స్ ప్రధాన పాత్రను పోషించాయి. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్ పృథ్వీ మాట్లాడారు. ఈ సినిమాలో ఫైట్స్ కోసం హీరో తేజ చాలా కష్టపడ్డాడని, ప్రతి ఫైట్ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. క్లైమాక్స్ ఫైట్ పర్‌ఫెక్ట్ గా రావడం కోసం 35 రోజులు కష్టపడ్డామన్నారు.