రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రంలో జోయాగా నటించి ప్రేక్షకులను అలరించారు నటి త్రిప్తి డిమ్రి. ఈ సినిమాతో ఆమె మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న త్రిప్తి ‘యానిమల్’ సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేశారు. సినిమా గురించి మాట్లాడుతూ తన పాత్రకు ఇంతటి పాపులారిటీ వస్తుందని అనుకోలేదని, ఆ క్షణాలు తన జీవితంలో ప్రత్యేకమైనవని త్రిప్తి చెప్పుకొచ్చారు
