కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. యశ్ మాస్ హీరోయిజం, స్టోరీ, స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకున్నాయి. దీనికి కొనసాయింపుగా వచ్చిన కేజీఎఫ్-2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో ఫిబ్రవరి 3వ తేదీన తెలుగు వెర్షన్ రీ రిలీజ్ కానుంది. కాగా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది