మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన ‘ఒక్కడు’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమాకు హీరోయిన్‌గా నమ్రత శిరోద్కర్‌ను డైరెక్టర్ గుణశేఖర్‌కు మహేశ్ బాబు సజెస్ట్ చేశారట. ఇందుకు ఆయన కూడా ఓకే చెప్పినప్పటికీ ఈ విషయం తెలుసుకున్న కృష్ణ వద్దన్నారట. అప్పటికే మహేష్ నమ్రతలు ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమని ముందుగా కృష్ణ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే కృష్ణ ఈ సినిమాలో నమ్రతను వద్దని చెప్పారట.
