UPDATES  

 నన్ను చూడగానే మేకప్ తీయమన్నారు: ప్రీతి జింటా..

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా తన తొలి సినిమా అనుభవాల్ని తాజాగా పంచుకున్నారు. 26 ఏండ్ల క్రితం ఆమె నటించిన ‘దిల్ సే’ మూవీ షూటింగ్ సమయంలోని ఓ ఫోటోను ఎక్స్ లో షేర్ చేసింది. ‘మూవీ సెట్‌లో ఫస్ట్ డే మణిరత్నం సార్ నన్ను చూశారు. నా వద్దకు వచ్చి నవ్వుతూ ముఖం కడుక్కొని రమ్మని చెప్పారు. సార్ మేకప్ పోతుంది అన్నాను. నాకు కావలసింది అదే అనడంతో మేకప్‌ తీసేశాను. ఆ తర్వాత తీసిన క్లోజప్‌ షాట్‌ అద్భుతంగా వచ్చింది’ అంటూ ప్రీతి తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !