గ్రూప్ – 4 ఫలితాలను TSPSC విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల జాబితాను వెల్లడించింది. గత సంవత్సరం జులైలో గ్రూప్-4 పరీక్షలను TSPSC నిర్వహించింది. 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, 7,26,837 మందిని మెరిట్ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అభ్యర్థులు వెబ్ సైట్ లో తమ ర్యాంకులు చూసుకోవాలని తెలిపింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.
