UPDATES  

 ఉసిరికాయ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలో తెలుసా ? తెలిస్తే అస్సలు వదలరు !!!!!

మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే చెట్లల్లో ఉసిరి చెట్టు కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. ఉసిరికాయను ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమలకా అని అంటారు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను అలాగే ఉసిరి చెట్టు ఆకులను, పూలను, గింజలను, వేర్లను, బెరడును ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరికాయలు ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఉసిరికాయల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వైద్యపరంగా ఉసిరికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఉసిరి జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను నివారిస్తుంది. షాంపుల తయారీలోనూ, తలకు రాసే నూనెల తయారీలోనూ, జుట్టుకు వేసుకునే రంగుల తయారీలోనూ ఉసిరికాయలను ఉపయోగిస్తున్నారు.

మలబద్దకానికి ఉసిరికాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. ఉసిరికాయ నుండి తీసిన నూనెను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. తలనొప్పి, తలభారాన్ని తగ్గించి మెదడుకు చల్లదనాన్ని అందించడంలో ఉసిరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజాగా జరిపిన పరిశోధనల్లో ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని , దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గవచ్చని వెల్లడైంది. ఉసిరికాయను తినడం వల్ల దేహానికి శక్తి లభిస్తుందని, దాహంగా ఉన్నప్పుడు ఉసిరికాయను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే దాహం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. Amla Juice మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజూ ఉసిరికాయను తీసుకుంటే ఇంజెక్షన్ వేసుకునే అవసరం ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఉసిరికాయ జ్యూస్ లో పటిక బెల్లం కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరికాయలతో చేసిన ఆమ్లా మురబ్బ తింటే వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదర సంబంధిత సమస్యలకు ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఉసిరికాయతో చేసిన మాత్రలను తీసుకోవడం వల్ల వాత, కఫ, పిత రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. ఉసిరికాయలను ఉపయోగించడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్న పొందవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని దానిని ప్రతిరోజూ ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి సమస్య తగ్గుతుంది. ఎసిడిటి, అల్సర్ వంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో ఒక ఉసిరి చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. భారతీయ వాస్తూ శాస్త్రంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరట్లో కనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తూ దోషాలు ఏవి ఉన్నా కూడా తొలగిపోతాయని వాస్తూ శాస్త్రం చెబుతుంది. ఉసిరికాయ ఉప్పు రుచిని తప్ప మిగిలిన ఐదు రుచులను కలిగి ఉంటుంది. నారింజలో కంటే ఉసిరిలో పది రెట్లు విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, క్యాల్షియం వంటివి కూడా ఉసిరిలో అధికంగా లభ్యమవుతాయి. ఉసిరిని క్రమం తప్పకుండా వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !