స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ‘నాకు వయసు పెరుగుతుంది. పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఇంట్లో ప్రెజర్ ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ మా పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనైతే లేదు. నేను ఎంత లౌడ్ స్పీకర్ అనేది మీకు తెలుసు. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేనే లౌడ్ గా ప్రకటిస్తాను’ అని చెప్పుకొచ్చారు.