రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.