మన్యం న్యూస్ కరకగూడెం: రాష్ట్ర ప్రభుత్వం తునికాకు టెండర్లను పిలిచి ప్రూనింగ్ పనులను వేంటనే చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటి సభ్యులు చర్ప.సత్యం,కొమరం.కాంతారావు ప్రభుత్వని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు బుధవారం తహశీల్దారు నాగ ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 తునికాకు యూనిట్లకు టెండర్లు పిలవాల్సి ఉండగా కేవలం 26 యూనిట్లుకె టెండర్లు ఖరారు చెయ్యడం వలన 168 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో టెండర్లు పిలిచి ప్రూనింగ్ పనులు ప్రారంభిస్తేనే ఆకు ఎక్కువ నాణ్యత ఉంటుందని లక్షలాదిమంది ఆదివాసి,గిరిజనులు తునికాకు సేకరణ రెండవ పంటగా ఉపాధి కల్పిస్తుందని అన్నారు ప్రతియట డిసెంబర్ జనవరి నెలలో అటవీ శాఖ మొదలుపెట్టేది కానీ ఏడాది ఆ ప్రక్రియ నత్తనడకన తలపిస్తుందని ఆయన అన్నారు.అలాగే పెండింగ్‌లో ఉన్న తునికాకు బోనస్ చెల్లించి తునికాకు 50 ఆకుల కట్టాకు 5 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల మా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.