తాను తండ్రైన విషయాన్ని టాలీవుడ్ హీరో శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన 40వ పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చారు. తన పాప పేరు ‘లీలా దేవి మైనేని’ అని ప్రకటించారు. శర్వానంద్ గతేడాది జూన్ లో హైకోర్టు న్యాయవాది కూతురు రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నారు.