కింగ్ నాగార్జున మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ హీరో ధనుష్‌తో ‘కుబేర’ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు నాగ్. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు నవీన్ రూపొందించనున్న ఓ మల్టీస్టారర్ మూవీలో నాగ్ నటించనున్నారట. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నాగ్‌తో పాటు మరో కథానాయకుడు కూడా కనిపించనున్నారని సమాచారం.