’కంగువ ప్రత్యేకమైన చిత్రం. ఇందులో భాగం కావడం నా అదృష్టం‘ అని సూర్య అన్నారు. ’ఇలాంటి గొప్ప కథను తెరకెక్కించాలనుకున్న దర్శకుడు శివ, నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లకు కృతజ్ఞతలు. డీఓపీ వెట్రి పళనిస్వామి, అద్భుతమైన సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్‌లకు ధన్యవాదాలు. ఏ సినిమాకైనా స్క్రిప్ట్‌కి, మేకింగ్‌కి మధ్యలో రాజీ పడే సందర్భాలు ఎదురవుతాయి. అలాంటి వాటిని అధిగమించి దీనిని తెరకెక్కించాం.’ అని సూర్య అన్నారు.