సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీ ‘పుష్ప-2′. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో స్టార్ నటి సమంత అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి పార్టులో సమంత స్పెషల్ సాంగ్తో కుర్రకారును ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.