మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నాకే దక్కే అవకాశం ఉందనీ పార్టీ సీనియర్ నాయకుడు సుందర సురేష్ ధీమా వ్యక్తం చేసాడు. ఆదివారం పత్రిక ముఖంగా ఈ విధంగా వాపోతూ… కాంగ్రెస్ పార్టీ నా పుట్టినిల్లు లాంటిదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందరి జగపతిరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆ రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నా శక్తి మేర కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మీద ఉన్న అంకిత భావంతో పార్టీకి కష్టపడుతున్నానీ కొంతమంది నాయకులు ప్రజారాజ్యం ,టిడిపి వెళ్లి వచ్చినవారేనని నేను మాత్రం ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మీద మక్కువతో నేటి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నానని అట్టి నాకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి అడిగే హక్కు నాకు ఉందని, వ్యవసాయాన్ని సైతం పక్కనపెట్టి మండలంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడుగుజాడల్లో నడుస్తూ అటు పార్టీ కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులకు నా శక్తి మేర సహాయం చేస్తున్నాను. భద్రాచలం, దుమ్ముగూడెం మండలంలో అధ్యక్ష పదవులను కాంగ్రెస్ పార్టీ యువకులకు ఇచ్చి ప్రోత్సహించిందనీ,అదేవిధంగా యువకుడనైన నాకు మండలాధ్యక్ష పదవి వస్తుందని,కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.