UPDATES  

 శ్రీ నాగులమ్మ తల్లి సుంకు పండగ మహోత్సవం..మంగళవారం మండె మెలుగుటతో ప్రారంభం…

 

మన్యం న్యూస్, మంగపేట.

 

మంగపేట మండలం వాగొడ్డు గూడెం పంచాయతీ పరిధి లో గల లక్ష్మీనర్సాపూర్(రాజుపేట) గ్రామం లో వెలసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఆదివాసీ సంప్రదాయ బద్దంగా “సుంకు పండగ” ను మార్చి26 నుండి మార్చి 29 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు,ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ తెలిపారు.ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఉన్న వారం లో మహా జాతర , సుంకు పండగ లను ప్రతి రెండేళ్ల కోసారి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మార్చి 26 మంగళవారం మండే మెలుగుట పూజలతో ప్రారంభవుతుందని,మార్చి 27 బుధవారం అమ్మవారికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, మార్చి 28 గురువారం పవిత్ర గోదావరి పుణ్యస్నానాలు ,అదే రోజు రాత్రి 11.45 గంటలకు సుంకు పండగ నిర్వహించి,అమ్మవారి వేల్పుల యొక్క డాలు గుడ్డ చరిత్ర ను కోయ పూజారుల చే ఆర్తి బిడ్డల డోలు వాయిద్యాల నడుమ వివరించడం జరుగుతుందని ,శుక్రవారం అమ్మవారి ఊరేగింపు తో సుంకు పండగ ఉత్సవం ముగుస్తుంది అని తెలిపారు.ఈ పూజా కార్యక్రమాలు ఆద్యంతం ఆదివాసీ పూజారులు,వడ్డెలు సమక్షం లో జరుగుతుందని,సుంకు పండగ కు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !