UPDATES  

 అంతా రంగులమయం…

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

వెంకటాపురం మండల కేంద్రంలో హోలీ పండుగ వేడుకలు అంబరాన్ని అంటాయి,, చిన్న పెద్ద అని తేడా లేకుండా బంధుమిత్రులతో కనువిందు అయినా రంగుల పండుగను మండల ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకరికొకరు కలర్లు పూసుకుంటూ, నృత్యాలతో ఆటపాటలతో, చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా, రంగుల పండగను ఆస్వాదించారు. ఈ హోలీ పండుగ వెంకటాపురం మండలంలో చాలా ప్రాముఖ్యతని చాటుకుంటుంది, పండుగ రోజె శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవ్వడంతో వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా చతిస్గడ్, బీజాపూర్, రాయపూర్,హైదరాబాద్ వివిధ జిల్లాల్లో నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా లక్షల సంఖ్యలో జనాలు వెంకటాపురం చేరుకొని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు, సుమారు 70 వేల పైచిలుకు భక్తులు చేరుకున్నట్టు గుడి యాజమాన్యం తెలిపారు. ఇదిలా ఉండగా అసలు హోలీ పండుగ అంటే ఏమిటి అని కాస్త లోతుకి వెళ్తే, పురాణాలలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది, పూర్వికులు వ్యక్తపరిచిన వివరాలు ప్రకారం భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్య కశ్యపుని చెల్లెలు అయినా హోలికా అనే రాక్షసి దహనానికి సాంకేతంగా ఈ పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రతిమను దహనం చేస్తారు అని, తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రాక్షసుల పరాక్రమం హోళిక దహనంతో అంతమైందని దీని అర్థం అట.

ఈ విధంగా దహనం చేయడం

ఆధునిక ప్రపంచంలో కనిపించకపోవడం పెద్ద విడ్డూరం ఏమీ కాదు. ఏదో సూచనప్రాయంగా చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో మినహా హోలీ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అన్న చందంగా పరిస్థితులు వారు జరిపే పండగలు రూపు సంతరించుకుంటున్నాయి.. కానీ ఈ సంవత్సరం వెంకటాపురం మండలంలో మాత్రం కొంతమేరకు సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పొచ్చు , ఈ హోలీ పండుగ నేపథ్యంలో కళ్యాణం జరుపుకుంటున్న వెంకటేశ్వర్ల స్వామి దంపతులకు కళ్యాణ నిర్వహణ పూజలో భాగంగా భద్రాచల నియోజకవర్గ బీ ఆర్ఎస్ అధ్యక్షులు తెల్ల వెంకటరావు , వివిధ ప్రాంతాల నుంచి మండల స్థాయిలో పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, సుప్రీంకోర్టు లాయర్లు వివిధ జిల్లాల నుంచి భక్తులు సైతం కళ్యాణానికి హాజరై కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసి హోలీ పండుగ వైభవాన్ని చాటి చెప్పిన సంకేతాలు ఇవ్వడం మళ్లీ ఈ హోలీ పండుగకు వైభవం వచ్చిందన్న స్థితిని కలిగించాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !