రామ్ చరణ్ అభిమానులకు మైత్రీ మూవీస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. స్టార్ దర్శకుడు సుకుమార్- రామ్ చరణ్‌ల కాంబోలో సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హోలీ సందర్భంగానే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ప్రకటించారు. ‘గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి’ అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్ చేసేందుకు RC17 రానుందని తెలిపారు.